వంట గ్యాస్ ధరల పెంపుపై నేడు (మార్చి 8) సీపీఎం నిరసన

వంట గ్యాస్ ధరల పెంపుపై నేడు (మార్చి 8) సీపీఎం నిరసన
  • పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై మరోసారి ధరల భారాన్ని మోపిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ మండిపడ్డారు. వంట గ్యాస్ ధరలను భారీగా పెంచడాన్ని నిరసిస్తూ ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను రూ.60, కమర్షియల్ సిలిండర్ ధరను రూ.115 పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, ఇప్పుడు గ్యాస్ ధరను పెంచడం పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనాన్ని ఛిన్నాభిన్నం చేయడమేనని ఫైర్​అయ్యారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని తమ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో సామాన్య ప్రజలు సైతం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.